తీవ్రవాద భావజాలంతో విద్యార్థి.. ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ అరెస్ట్
తీవ్రవాద భావజాలంతో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నాడనే ఆరోపణలపై ఐఐటీ గువహాటి విద్యార్థిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాంలోని కమ్రూప్ జిల్లా హజో పట్టణానికి సమీపంలో శనివారం రాత్రి అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ విషయాన్ని అసోం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సింగ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఐఐటీ గువహాటి విద్యార్థి ఐసిస్ పట్ల విధేయత చూపిస్తున్నట్టుగా చెబుతున్నాడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు.
తీవ్రవాద భావజాలంతో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నాడనే ఆరోపణలపై ఐఐటీ గువహాటి విద్యార్థిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాంలోని కమ్రూప్ జిల్లా హజో పట్టణానికి సమీపంలో శనివారం రాత్రి అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ విషయాన్ని అసోం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సింగ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఐఐటీ గువహాటి విద్యార్థి ఐసిస్ పట్ల విధేయత చూపిస్తున్నట్టుగా చెబుతున్నాడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. అరెస్టయిన విద్యార్థిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ(ఎస్‌టీఎఫ్) కల్యాణ్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఒక ఈ-మెయిల్‌లోని సందేశాన్ని నిర్ధారించామని చెప్పారు. ఈ-మెయిల్‌లోని సందేశాన్ని ధ్రువీకరించిన అనంతరం దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. ఈ-మెయిల్‌ను విద్యార్థే పంపించాడని, ఐసిస్‌లో చేరడానికి వెళ్తున్నట్టుగా అందులో పేర్కొన్నాడని వివరించారు. విద్యార్థి అరెస్ట్ విషయాన్ని ఐఐటీ గువహాటి అధికారులకు తక్షణమే తెలియజేశామని వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జూబ్లీహిల్స్ అపోలో ఆలయంలో ఘనంగా తృతీయ పుష్కరోత్సవం
Chiranjeevi: శ్రీకాంత్ నివాసానికి కేక్‌తో వెళ్లిన చిరంజీవి
ఎండకు తట్టుకోలేక చెరకురసం తాగుతున్నారా ?? యమడేంజర్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

