ఉత్తరాఖండ్‌లో అమలులోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి

Updated on: Jan 27, 2025 | 5:27 PM

సుదీర్ఘ కసరత్తు అనంతరం బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ అమలులోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కీలక ప్రకటన చేశారు. దేశంలోనే యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుందని సీఎం అన్నారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు.

యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందని ఆయన అన్నారు. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చేశామన్నారు. తొలుత యూసీసీ ముసాయిదా రూపకల్పనకు ప్రభుత్వం 2022 మే నెలలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని నియమించింది. సుదీర్ఘమైన కసరత్తు అనంతరం కమిటీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా, గత ఏడాది ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదించింది. నెల రోజుల తర్వాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది. యూసీసీ బిల్లు అమలు మార్గదర్శకాల కోసం మాజీ సీఎస్ శత్రుఘ్నసింగ్ సారథ్యంలో ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. గత ఏడాది చివరిలో నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించిన ఉత్తరాఖండ్ కేబినెట్ యూసీసీ అమలు తేదీని ఖరారు చేసే అధికారాన్ని సీఎం ధామికి అప్పగిస్తూ తీర్మానం చేసింది. ఈ క్రమంలో సీఎం ధామి సోమవారం జనవరి 27 నుంచి యూసీసీ అమలులోకి వస్తుందని కీలక ప్రకటన చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొలంబియా యూటర్న్‌.. ట్రంప్‌ నిబంధనలకు ఓకే

కుంభమేళా చుట్టూ చిట్టడవి.. స్వచ్ఛమైన గాలికి కొదవే లేదు..

శివ శంకర్‌గా మారిన సద్దాం హుసేన్.. ప్రియురాలి కోసం హిందువుగా

అక్షయ్ సినిమాపై వివాదం భగ్గుమంటున్న ఆ వర్గం