AP Minister Roja: చంద్రబాబు, జగన్ మధ్య తేడా అదే.. మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు, జగన్ మధ్య పోలికే లేదన్నారు ఏపీ మంత్రి రోజా. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌తో క్రాస్ ఫైర్‌లో పాల్గొని మాట్లాడిన రోజా.. పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాను చూసిన నేతల్లో జగన్ అందరికంటే మించిన నాయకుడిగా అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మంచి నాయకుడిగా తనకు ఏ కోశానా అనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, జగన్ మధ్య పోలికే లేదన్నారు ఏపీ మంత్రి రోజా. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌తో క్రాస్ ఫైర్‌లో పాల్గొని మాట్లాడిన రోజా.. పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాను చూసిన నేతల్లో జగన్ అందరికంటే మించిన నాయకుడిగా అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మంచి నాయకుడిగా తనకు ఏ కోశానా అనిపించడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు చెప్పుకునే గొప్పలు ఆయనవి కావన్నారు. ఈ విషయం ఇప్పుడు అందరికీ అర్ధమయ్యిందన్నారు. ఒకసారి వాజ్‌పేయి, మరోసారి మోదీ వేవ్ కారణంగానే వారితో కలిసి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అయితే జగన్ సొంత పార్టీతో తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయాలకు వచ్చి తానేంటో నిరూపించుకున్నారని కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్‌లో ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు సమాధానంగా రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

