AP Minister RK Roja: ఆంధ్రలో అభివృద్ధి జరగలేదా..? మంత్రి రోజా సమాధానం ఇదే..

AP Minister RK Roja: ఆంధ్రలో అభివృద్ధి జరగలేదా..? మంత్రి రోజా సమాధానం ఇదే..

Janardhan Veluru

|

Updated on: Feb 26, 2024 | 7:59 PM

వైఎస్ జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి జరగలేదన్న ప్రచారంలో నిజంలేదని మంత్రి రోజా అన్నారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ అడిగిన పలు ప్రశ్నలకు రోజా సమాధానమిచ్చారు. అర్హులైన వారికే ఆర్థిక భరోసా కోసం సంక్షేమ నిధులు ఇస్తున్నట్లు చెప్పారు.

వైఎస్ జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి జరగలేదన్న ప్రచారంలో నిజంలేదని మంత్రి రోజా అన్నారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ అడిగిన పలు ప్రశ్నలకు రోజా సమాధానమిచ్చారు. అర్హులైన వారికే ఆర్థిక భరోసా కోసం సంక్షేమ నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి కనిపిస్తోందని.. హైదరాబాద్‌లో ఉండి రాజకీయాల కోసం ఏపీకి వచ్చే నేతలకు మాత్రమే ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు.