WITT: రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదు.. టీవీ9 సదస్సులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
తమ ప్రభుత్వం సుపరిపాలనకు పెద్దపీట వేసిందని, రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీవీ9 గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడేలో పాల్గొని మాట్లాడిన ప్రధాని.. గత ప్రభుత్వాల హయాంలో దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.
తమ ప్రభుత్వం సుపరిపాలనకు పెద్దపీట వేసిందని, రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీవీ9 గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడేలో పాల్గొని మాట్లాడిన ప్రధాని.. గత ప్రభుత్వాల హయాంలో దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలోని ప్రజలను పేదరికంలో ఉంచడానికి గత పాలకులు ఇష్టపడతారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో పేదరికంలో మగ్గుతున్న ప్రజలకు కాస్త ముట్టచెప్పి తమ చేతులు దులుపుకునే వారని అన్నారు. దీని వల్ల దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు పుట్టుకొచ్చాయన్నారు. అయితే తమ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల మీద కాకుండా సుపరిపాలనపై దృష్టిసారించినట్లు చెప్పారు. గత 10 సంవత్సరాలుగా ఇదే మా మంత్రం, ఇదే మా ఆలోచన.. సబ్కా సాత్, సబ్కా వికాస్ అన్నారు. గత ప్రభుత్వాలకు భారతీయతపై నమ్మకం లేదని ఆరోపించారు.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

