Free Current in Telangana: అది ఉంటేనే ఉచిత విద్యుత్‌ లభ్యం.! తెలంగాణ గృహజ్యోతి పథకం.

Free Current in Telangana: అది ఉంటేనే ఉచిత విద్యుత్‌ లభ్యం.! తెలంగాణ గృహజ్యోతి పథకం.

Anil kumar poka

|

Updated on: Feb 19, 2024 | 12:43 PM

గృహజ్యోతి లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలంగాణ విద్యుత్ శాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. బయోమెట్రిక్ విధానంలో ఈ వ్యాలీడెషన్ పూర్తి చేస్తేనే ఉచిత కరెంట్ పథకంలో పేర్లు నమోదవుతాయని తెలిపింది. ఆధార్ వేరిఫికెషన్ ప్రాసెస్ లో డిస్కంలు చేపట్టాలని విద్యుత్ శాఖ తన ప్రకటనలో ఆదేశించింది.

గృహజ్యోతి లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలంగాణ విద్యుత్ శాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. బయోమెట్రిక్ విధానంలో ఈ వ్యాలీడెషన్ పూర్తి చేస్తేనే ఉచిత కరెంట్ పథకంలో పేర్లు నమోదవుతాయని తెలిపింది. ఆధార్ వేరిఫికెషన్ ప్రాసెస్ లో డిస్కంలు చేపట్టాలని విద్యుత్ శాఖ తన ప్రకటనలో ఆదేశించింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్‌ను సిబ్బందికి తెలపాలి. ఎవరికైనా ఆధార్ లేకపోతే వెంటనే తీసుకొని ఆ తక్షణం దరఖాస్తు చేసుకుని, ఆ ఫ్రూప్ చూపించాలి. అయితే ఆధార్ జారీ అయ్యేవరకూ ఇతర గుర్తింపు కార్డులను వినియోగించవచ్చు. బ్యాంకు, పోస్టాఫీసు పాస్‌బుక్‌లో ఖాతాదారుడి ఫొటోతో ఉన్న జిరాక్స్, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఎవరైనా గెజిటెడ్ అధికారి, ఎమ్మార్వో ఇచ్చిన ధ్రువీకరణ పత్రం వంటి వాటిల్లో ఏదైనా విద్యుత్ సిబ్బందికి చూపి పేర్లు నమోదు చేసుకోవాలి.

బయోమెట్రిక్ వ్యాలీడెషన్ లో భాగంగా వేలిముద్ర లేకుంటే కనురెప్పలను స్కాన్ చేయాలని విద్యుత్ శాఖ తన ఆదేశాల్లో తెలిపింది. డిస్కంలే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే దాని యజమాని సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలని చెప్పింది. అది కాకపోతే, ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలను విద్యుత్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తొందరలోనే వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..