Telangana: పసుపు బోర్డు ఏర్పాటుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి లేఖ..

Telangana: పసుపు బోర్డు ఏర్పాటుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి లేఖ..

Ravi Kiran

|

Updated on: Feb 19, 2024 | 9:11 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గత సంవత్సరం అక్టోబర్ 4న మోదీ ప్రకటించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారాయన.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గత సంవత్సరం అక్టోబర్ 4న మోదీ ప్రకటించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారాయన. పసుపు బోర్డు ఏర్పాటు తెలంగాణ రైతుల చిరకాల వాంఛ అని ఆయన లేఖలో తెలిపారు. పసుపు బోర్డుకు కేంద్రం గెజిటెడ్ విడుదల చేసినా అందులో ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ప్రస్తావించలేదన్నారు తుమ్మల. మద్దతు ధర లేకపోవడంతో సాగు విస్తీర్ణం పడిపోతోందని వెంటనే జాతీయ పసుపు బోర్డ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు తుమ్మల.

గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నిజామాబాద్‌ ఎంపీ నియోజకవర్గంలో నెగ్గింది బీజేపీ. పసుపు బోర్డు ఏర్పాటుపై స్వయంగా ప్రధాని మోదీ ప్రకటన చేయడంతో రైతన్నలు సంబరాలు జరుపుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తు్న్న వేళ ప్రధానికి తుమ్మల లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..