Telangana LS Polls: బీఆర్ఎస్, కాంగ్రెస్ చేతులు కలిపాయి.. రఘునందన్ రావు సంచలన కామెంట్స్

|

Apr 15, 2024 | 3:19 PM

ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడు రాధా కిషన్ ఇచ్చిన ఆధారాల ప్రకారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడు రాధా కిషన్ ఇచ్చిన ఆధారాల ప్రకారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వెంకట్రామిరెడ్డి రెడ్డి డబ్బులు పంపినట్టు పోలీసుల విచారణలో రాధాకిషన్ చెప్పారని అన్నారు. అయినా వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువు కాబట్టి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేయడం లేదా? అని ప్రశ్నించారు.

అలాగే రూ.14 కోట్ల బెదిరింపులకు పాల్పడి వసూలు చేసుకున్న ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్సీ కవితపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటేనని ఆరోపించిన ఆయన.. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవకుండా అడ్డుకోవాలని ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మండిపడ్డారు.

Published on: Apr 15, 2024 03:19 PM