Watch Video: ప్రధాని మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి? బండి సంజయ్‌పై వినోద్ ఫైర్

|

May 08, 2024 | 6:41 PM

కరీంనగర్‌ అవసరాలు గురించి ఒక్కటంటే ఒక్కటి ప్రధాని మోదీ ముందు ప్రస్తావించలేని స్థానిక ఎంపీ బండి సంజయ్‌కి రానున్న ఎన్నికల్లో ప్రజలెందుకు ఓటేయాలని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. ప్రధాని మోదీ దగ్గర నియోజకవర్గ ప్రజల బాగోగుల గురించి బీజేపీ ఎంపీ పల్లెత్తు మాట మాట్లాడలేదన్నారు.

కరీంనగర్‌ అవసరాలు గురించి ఒక్కటంటే ఒక్కటి ప్రధాని మోదీ ముందు ప్రస్తావించలేని స్థానిక ఎంపీ బండి సంజయ్‌కి రానున్న ఎన్నికల్లో ప్రజలెందుకు ఓటేయాలని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. ప్రధాని మోదీ దగ్గర నియోజకవర్గ ప్రజల బాగోగుల గురించి బీజేపీ ఎంపీ పల్లెత్తు మాట మాట్లాడలేదన్నారు. స్వయంగా ప్రధాని మన దగ్గరకు వచ్చినా.. ఆయన్ను ఏమీ అడగలేని ఎంపీ మనకు ఎందుకన్నారు. మోదీ సభలో 15 నిమిషాలు మాట్లాడిన బండి సంజయ్.. ఒక్క నిమిషం కూడా నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడలేదన్నారు. ఏం మాట్లాడినా వింటారని ప్రజలను తేలిగ్గా తీసుకుంటున్నారని వినోద్‌కుమార్‌ ఫైరయ్యారు. వేములవాడ సభలో మోదీ ప్రసంగాన్ని చూస్తుంటే ఆయన ఫ్రస్టేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.