ఇంటింటికి బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరల పంపిణీ.. ఎవరు అర్హులంటే
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా 'ఇందిరమ్మ చీరల పంపిణీ'కి నూతన, పారదర్శక మార్గదర్శకాలను విడుదల చేసింది. మహిళా సంఘాల ద్వారా ఇంటింటికీ చీరల పంపిణీ జరుగుతుంది. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఆధార్ ధృవీకరణతో ఈ పథకం వర్తిస్తుంది. అక్రమాలను నిరోధించడానికి మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. SERP, MEPMA విలీనం ద్వారా స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతం కానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి మేలు కోసం ప్రత్యేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తుంది. తాజాగా ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’కి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈసారి పంపిణీ విధానాన్ని పూర్తి పారదర్శకంగా, గ్రామాల వరకు చేరుకునేలా రూపొందించారు. సెర్ప్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ సూచనల ప్రకారం… జిల్లా, మండల స్థాయి కార్యక్రమాల అనంతరం మహిళా సంఘాల బృందాలు నేరుగా ఇంటింటికీ వెళ్లి చీరలను అందించనున్నాయి. ప్రతి మండలాన్ని పర్యవేక్షించేందుకు సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవోను బాధ్యులుగా నియమించారు.మంత్రి సీతక్క సూచనలతో మహిళా సంఘాల సభ్యులు ఇంటికెళ్లి ప్రతీ మహిళకు బొట్టు పెట్టి గౌరవంగా చీరను అందజేయడం తప్పనిసరి చేశారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలు. అయితే అక్రమాలు చోటుచేసుకోకుండా, లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఆధార్ ధృవీకరణ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. పెన్షనర్ల ధృవీకరణకు ఉపయోగిస్తున్న మొబైల్ యాప్‌ను ఈ పంపిణీలోనూ వినియోగిస్తారు. మహిళ చీర పొందిన వెంటనే ఆమె ఫొటోను యాప్‌లో నమోదు చేసిన తర్వాత మాత్రమే చీరను అందజేయాలి. సంఘానికి సభ్యురాలు కానివారు చీర తీసుకోవాలనుకుంటే, ముందుగా సభ్యత్వం నమోదు చేసి తర్వాతే పంపిణీ చేస్తారు. ప్రతిరోజూ పంపిణీ పురోగతిపై కలెక్టర్లు సెర్ప్‌కు రిపోర్ట్ అందించాలి. ఇక 15 – 18 ఏళ్ల యువతుల కోసం ప్రత్యేకంగా లంగావోణీలు అందించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అనుమతి వచ్చిన తర్వాత దీనిపై తుది నిర్ణయం వెల్లడించనుంది. అలాగే రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల శక్తిని ఒకే వేదికపైకి తెచ్చే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పురపాలక ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థను విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌కు మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఈ విలీనంతో గ్రామీణ, పట్టణ మహిళా సంఘాల మధ్య సమన్వయం పెరిగి, స్త్రీ సాధికారత కార్యక్రమాలు మరింత వేగం అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ములుగు జిల్లాలో గుప్తనిధులు.. ఒక్కో నాణెం 23 తులాలు ??
తోటలో పనిచేసుకుంటున్న రైతు.. పొదల మధ్య సీన్ చూసి షాక్
iBomma: ఐ బొమ్మ రవికి ఎలాంటి దారుణ శిక్ష పడబోతుందో తెలుసా ??
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

