Watch Video: ఏపీకి ప్రత్యేక స్టేటస్ ఇచ్చారా..? ప్రధాని మోదీ సభకు ఎలా వెళ్తావ్..? పవన్‌కు వీహెచ్ ప్రశ్న
సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ఉన్న ఇమేజ్‌ను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు(వీహెచ్) అన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పవన్ కల్యాణ్ వేదిక పంచుకోవడంపై ఆయన స్పందించారు. బీజేపీ సభలో పవన్ కల్యాణ్ పాల్గొనడం సరికాదన్నారు.
సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ఉన్న ఇమేజ్‌ను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు(వీహెచ్) అన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పవన్ కల్యాణ్ వేదిక పంచుకోవడంపై ఆయన స్పందించారు. బీజేపీ సభలో పవన్ కల్యాణ్ పాల్గొనడం సరికాదన్నారు. కాపులను ఇంకా బీసీల్లో ఇంకా కలపలేదని.. బీజేపీ సభకు కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే ఈ డిమాండ్‌ను బీజేపీ నెరవేర్చలేదని.. అయినా నేడు వారి సభలకు పవన్ ఎలా వెళతారని వీహెచ్ ప్రశ్నలు గుప్పించారు.
Published on: Nov 07, 2023 07:06 PM
వైరల్ వీడియోలు
Latest Videos