Watch Video: మంత్రి కేటీఆర్ వాహనాన్ని చెక్ చేసిన పోలీసులు, ఎన్నికల సిబ్బంది
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆకస్మిక తనిఖీలు ఉధృతం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా విలువ చేసే నగదు, లిక్కర్, ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాహన తనఖీల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు ఎవరినీ విడిచిపెట్టడం లేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆకస్మిక తనిఖీలు ఉధృతం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా విలువ చేసే నగదు, లిక్కర్, ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాహన తనఖీల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు ఎవరినీ విడిచిపెట్టడం లేదు. తాజాగా మంత్రి కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న కేటీఆర్ వాహనాన్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆపారు. వాహనంలో తనిఖీ చేశారు. కేసీఆర్ తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డి బయలుదేరారు.
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

