Uttam Kumar Reddy: వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీ సాధిస్తాం.. ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటా : ఉత్తమ్ కుమార్ రెడ్డి.
వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్‌నగర్‌లో 50 వేల మెజార్టీ సాధిస్తాం. ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో నిస్వార్థంగా పనిచేశానని చెప్పుకొచ్చారు. విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేశానన్నారు. 1994 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నా ఇప్పటికీ తనకు సొంత ఇల్లు లేదన్నారు ఉత్తమ్. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో కృషిచేసినట్టు చెప్పారు. తనకు పిల్లలు లేరన్న ఉత్తమ్… కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలనే పిల్లలుగా భావిస్తున్నట్టు చెప్పారు. కోదాడలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈ కామెంట్స్ చేశారు ఉత్తమ్. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో 50వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు ఉత్తమ్
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

