Andhra Pradesh: పొత్తు సరే.. మరి సీట్లు? ఏపీలో కొనసాగుతున్న ఉత్కంఠ..

|

Mar 11, 2024 | 9:10 AM

పొత్తులు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపికపై మూడు పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. అన్ని ఈక్వేషన్స్‌తో క్యాండేట్లను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. అభ్యర్థుల జాబితా, మూడు పార్టీల సీట్ల షేరింగ్ పై కసరత్తు కొనసాగుతోంది.

పొత్తులు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపికపై మూడు పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. అన్ని ఈక్వేషన్స్‌తో క్యాండేట్లను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. అభ్యర్థుల జాబితా, మూడు పార్టీల సీట్ల షేరింగ్ పై కసరత్తు కొనసాగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే లిస్ట్‌ ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. పొత్తులు, సీట్ల సర్దుబాటు సీన్ ఢిల్లీ నుంచి ఏపీకి మారింది.. విజయవాడలో ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ తొలి ఉమ్మడి సమావేశం జరగనుంది. నిన్న పురంధేశ్వరి, పవన్‌తో బీజేపీ కేంద్ర బృందం భేటీ అయింది.. గజేంద్రసింగ్‌ షెఖావత్‌, జయంత్‌ పాండా, శివప్రకాష్‌ చర్చలు జరిపారు. నేడు మూడుపార్టీల మీటింగ్‌లో చంద్రబాబు పాల్గొననున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..