PM Modi: పీఎం మోడీ భారీ బహిరంగ సభ
తెలంగాణలో రెండోరోజు పర్యటనలో భాగంగా, సంగారెడ్డికి వచ్చారు ప్రధాని మోదీ. పటేల్‌గూడ సభలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుడుతున్నారు. అయితే వరుసగా రెండోరోజు కూడా బడేభాయ్‌తో సీఎం రేవంత్ వేదికను పంచుకుంటున్నారు. ఇప్పుడిదే అంశం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతగా, CMగా రేవంత్.. ప్రధానిని బడేభాయ్ అని పిలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగానూ హాట్ టాపిక్ అయ్యింది.
తెలంగాణలో రెండోరోజు పర్యటనలో భాగంగా, సంగారెడ్డికి వచ్చారు ప్రధాని మోదీ. పటేల్‌గూడ సభలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుడుతున్నారు. అయితే వరుసగా రెండోరోజు కూడా బడేభాయ్‌తో సీఎం రేవంత్ వేదికను పంచుకుంటున్నారు. ఇప్పుడిదే అంశం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతగా, CMగా రేవంత్.. ప్రధానిని బడేభాయ్ అని పిలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగానూ హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ అవసరాల కోసం కేంద్రంతో సఖ్యత కోరుతున్నామనే మాట CM చెప్తున్నా.. ఈ తరహా పిలుపును BRS అస్త్రంగా వాడుకుంది. BJP- కాంగ్రెస్ ఒకటేనని విమర్శలు చేసింది. ఇవాళ్టి పటాన్‌చెరు ఎన్నికల శంఖారావం సభలో మోదీ పొలిటికల్‌గా ఎలాంటి కౌంటర్లు ఇస్తారు.. తెలంగాణకు ఏ హామీలు ఇస్తారు..? సంగారెడ్డి జిల్లా చేరుకున్నారు ప్రధాని మోదీ. 9 వేల 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్‌గా చేయబోతున్నారు. 1409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్ల రూపాయలతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ సౌత్ నిర్మాత నన్ను రూమ్‌కి రమ్మన్నాడు..
పెట్రోల్ కొట్టించేందుకు బైక్‌తో బంక్‌కు.. అంతలోనే వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా !!
భర్త విఘ్నేశ్ ను అన్ ఫాలో చేసిన నయన్.. పొరపాటా ?? సాంకేతిక తప్పిదమా ??
కునుకు తీసిన ఉపాసన.. కాళ్లు నొక్కిన మెగా హీరో
100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా.. సొంత సినిమాలలో నష్టపోయినట్లు సినీ నటి