Bihar Politics: బిహార్ ఎన్నికల ప్రచార రంగంలోకి ప్రధాని మోదీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ, జేడీయూ చెరో 121 స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యాయి. ప్రధాని మోదీ పది ర్యాలీలతో రంగంలోకి దిగుతుండగా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సైతం విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్కంఠ నెలకొంది. సీట్ల సర్దుబాటు ఖరారు కావడంతో అధికార ఎన్డీఏ కూటమి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బీజేపీ, జేడీయూలు చెరో 121 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన మొత్తం పది చోట్ల భారీ ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. 2020 ఎన్నికల్లో ఎన్డీఏ బలహీనమైన ఫలితాలనిచ్చిన నియోజకవర్గాలపై మోదీ దృష్టి సారించనున్నారు. ప్రతి మూడు ర్యాలీల్లో ఒకచోట ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని మోదీతో వేదికను పంచుకుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా
ఒంగోలు పేస్ కాలేజీ సమీపంలో రోడ్డుప్రమాదం
Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు బీజేపీ ఆగ్రహం
Published on: Oct 13, 2025 03:08 PM
