ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు చర్యలు చేపట్టారు. నకిలీ వేబిల్లులతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక మాఫియా బాగోతం వెలుగుచూసింది. క్వారీ నిర్వాహకుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నా, పూర్తిస్థాయి విచారణ లోపించడంతో స్థానికులు కలెక్టర్‌ను లోతైన దర్యాప్తునకు కోరుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నకిలీ వేబిల్లులతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కొందరి బాగోతం బట్టబయలైంది. ఈ వ్యవహారంలో ఇసుక ర్యాంపు నిర్వాహకుల పాత్ర ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నాలుగు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామానుజవరం ఇసుక క్వారీ నుంచి నకిలీ వేబిల్లులతో హైదరాబాద్‌కు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ లారీని అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేసి, లారీని సీజ్ చేశారు. వేబిల్లులను పరిశీలించగా అవి నకిలీవిగా తేలడంతో ఇసుక అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒంగోలు పేస్ కాలేజీ సమీపంలో రోడ్డుప్రమాదం
Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు బీజేపీ ఆగ్రహం
రుషికొండపై ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

