Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు బీజేపీ ఆగ్రహం
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతిపై తమిళనాడు బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి మాజీ డీఎంకే నేత సెంథిల్ బాలాజీనే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌పై కూడా విమర్శలు గుప్పించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది.
కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు కారణమనే దానిపై తమిళనాడు బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ, ఈ తొక్కిసలాటకు డీఎంకే మాజీ నేత సెంథిల్ బాలాజీనే కారణమని ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే కరూర్ లో తొక్కిసలాట జరిగేలా చేసి అమాయకుల ప్రాణాలు తీశారని ఆయన మండిపడ్డారు. అంతేకాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనా నైనార్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 ఏప్రిల్ 20 తర్వాత తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. జనవరి 10 తర్వాత కూటమి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రుషికొండపై ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..

