Telangana Elections: ఓట్ల పండగలో నోట్ల జాతర..! అప్పుడు రూ.137 కోట్లు.. ఇప్పుడు 10రోజుల్లోనే రూ.243 కోట్లు సీజ్.
తెలంగాణలో ఓట్ల పండగలో నోట్ల జాతర జరుగుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో డబ్బు, మద్యం పట్టుబడుతోంది. 2018ఎన్నికల సమయంలో డబ్బైతేనేం, మద్యం అయితేనేం 137 కోట్ల రూపాయల మేర పట్టుబడింది. కానీ ఈసారి మొదటి పదిరోజుల్లోనే ఏకంగా 243కోట్ల రూపాయల సొమ్ము సీజ్ చేశారు ఇందులో 87కోట్ల 92లక్షల నగదు.. 120కోట్ల 40లక్షల విలువచేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో ఓట్ల పండగలో నోట్ల జాతర జరుగుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో డబ్బు, మద్యం పట్టుబడుతోంది. 2018ఎన్నికల సమయంలో డబ్బైతేనేం, మద్యం అయితేనేం 137 కోట్ల రూపాయల మేర పట్టుబడింది. కానీ ఈసారి మొదటి పదిరోజుల్లోనే ఏకంగా 243కోట్ల రూపాయల సొమ్ము సీజ్ చేశారు ఇందులో 87కోట్ల 92లక్షల నగదు.. 120కోట్ల 40లక్షల విలువచేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ముల్లో 182కిలోల బంగారం, 693కిలోల వెండి, 154 వజ్రాలు ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇక 10కోట్ల 21లక్షలు విలువ చేసే 65వేల లీటర్ల మద్యాన్ని కూడా సీజ్ చేసారు అధికారులు. ఇవి కాకుండా 17కోట్ల 48లక్షల విలువ చేసే ఇతరత్రా వస్తువులు పట్టుకున్నారు. ఇందులో బియ్యం, చీరెలు, ల్యాప్ టాప్స్, క్రీడా సామాగ్రి, వాహనాలు ఉన్నాయి. ఇదే 2018జనరల్ ఎన్నికల సమయంలో చూసుకున్నట్టయితే 97 కోట్ల నగదు, 3.2 కోట్లు విలువచేసే బంగారం, వెండి వస్తువులు, 2.3కోట్ల మద్యం, 42 లక్షల విలువచేసే మత్తుపదార్ధాలు, 34 కోట్లు విలువచేసే ఇతరత్రా వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు రికార్డులు చెప్తున్నాయి. ఈ ఎలక్షన్‌ను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. నోటిఫికేషన్‌కి ముందే డీజీపీ, సీఎస్, ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర ఎన్నికల కమిటీ.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహం జరగకుండా అడ్డుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సరిహద్దులో 169 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. మరో 89 చెక్‌పోస్ట్‌లను రాష్ట్రంలోని పలుచోట్ల ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. దీంతో పెద్ద మొత్తంలో పట్టుబడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉండబోతోందో అన్న విషయం ఊహకే అందడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..