100కు పైగా సీట్లు గెలవబోతున్నాం-టీవీ9తో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి
రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లే దమ్ముందా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల కూటమితో కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. ఉత్తర తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఆదరణ లభిస్తుందని, రాహుల్ గాంధీ పర్యటనతో పార్టీ గెలుపు ఖాయమని తేలిందని వెంకటరెడ్డి చెప్పారు.
తెలంగాణ ఎన్నికలవేళ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని విమర్శించే నైతిక అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు కోమటిరెడ్డి. ప్రస్తుతం ఆయన నల్లగొండ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వస్తున్న కార్యకర్తలకు ఆయన కండువా కప్పి ఆహ్వానించారు.
ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ గెలుపుకు ఓటు వేయాలంటూ కోరుతున్నారు. దత్తత పేరుతో నల్లగొండ నియోజక వర్గాన్ని సీఎం కేసీఆర్ మోసం చేశారని కోమటిరెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లే దమ్ముందా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల కూటమితో కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. ఉత్తర తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఆదరణ లభిస్తుందని, రాహుల్ గాంధీ పర్యటనతో పార్టీ గెలుపు ఖాయమని తేలిందని వెంకటరెడ్డి చెప్పారు. ఈనెల 30వ తేదీన నల్లగొండలో ప్రియాంక గాంధీ పర్యటన ఉండే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో బీఆర్ఎస్ మైండ్ బ్లాంక్ అయిందని కోమటిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు రావడం ఖాయమనన్నారు. టికెట్లు రాని నేతలు పార్టీపై చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు వెంకటరెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చేయండి..