News Watch LIVE: కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ ఆఫీస్ సోదాల వెనుక..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ ఆఫీస్ సోదాల వెనుక..? మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..
హైదరాబాద్, మాదాపూర్‌లోని ఇనార్బిట్ దగ్గరున్న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యాలయం.. ఒక్కసారిగా పోలీసుల చొరబాటుతో యుద్ధరంగంగా మారింది. వ్యూహకర్త సునీల్ కనుమోలు లీడ్ చేస్తున్న కాంగ్రెస్ ఆఫీసులో ఖాకీల ఎంట్రీ… నిన్న నైట్ అవర్స్ అంతా ఇదే లొల్లి.ఆపన్న హస్తం… హస్తం పార్టీ సోషల్ మీడియా పేజ్… ఇందులో తెలంగాణా ప్రభుత్వాన్ని, తెలంగాణా సీఎంనీ అప్రతిష్టపాలు చేసేలాంటి పోస్టులున్నాయన్నది సైబర్ క్రైమ్ పోలీసుల అభియోగం. దాని ఫలితమే వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీస్‌కి తాళాలు పడ్డాయి. కానీ.. ఆ తాళాలేసిన తీరే కాంగ్రెస్సోళ్లకు నచ్చలేదు.మొత్తం ఐదు ఫిర్యాదులున్నాయి… ఎఫ్‌ఐఆర్లు కూడా టైపవుతున్నాయ్… అంతలోపలే ఈ తొందరేంటి.. అంటూ చెయ్యాల్సిందంతా చేసుకుపోయారు పోలీసులు. మెరుపు సోదాలు పూర్తయ్యాయ్. సర్వర్ రూమ్ తెరుద్దామంటే తాళాల్లేవు. దొరికిన సీపీయూల్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..