News Watch Live: ఈటల ఫామ్ హౌస్ భేటీ దేనికి సంకేతం..? తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి..! వీక్షించండి న్యూస్ వాచ్.
బీజేపీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సడెన్‌గా ఎటో వెళ్లారు. ఈరోజు అందుబాటులో ఉండనంటూ ముందు రోజే కార్యకర్తలకు సమాచారం పంపారు. గురువారం ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ చేరుకున్న ఈటల రాజేందర్.. తన వాహనాన్ని, వ్యక్తిగత సిబ్బందిని, గన్ మెన్లను తిరిగి పంపించేశారు.
బీజేపీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సడెన్‌గా ఎటో వెళ్లారు. ఈరోజు అందుబాటులో ఉండనంటూ ముందు రోజే కార్యకర్తలకు సమాచారం పంపారు. గురువారం ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ చేరుకున్న ఈటల రాజేందర్.. తన వాహనాన్ని, వ్యక్తిగత సిబ్బందిని, గన్ మెన్లను తిరిగి పంపించేశారు. అక్కడ నుంచి ఇతరుల వాహనంలో ఈటల రాజేందర్.. నగర శివారులోని ఓ ఫార్మ్ హౌజ్ కు వెళ్లారు. అక్కడ ఇద్దరు కీలక నేతలతో సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఇటీవల ఈటల రాజేందర్ హస్తినకు వెళ్లి వచ్చారు. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో వన్ టు వన్ సమావేశం అయ్యారు. ఆ తర్వాత పార్టీ ఇన్ సైడ్ యాక్టివిటీ వేగం పెంచారు.
చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ గతంలో ఖమ్మం వెళ్లి.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లితో జరిపిన చర్చలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. గతంలో మీడియాకు సమాచారం ఇచ్చి ఖమ్మం వెళ్లిన ఈటల రాజేందర్.. ఈ సారి గప్‌చుప్‌గా వారితోనే రెండో దశ చర్చలు జరిపారా ? లేక వేరే ఇంకేవరితోనైనా సమాలోచనలు చేశారా .. ? ఎన్నికల దగ్గర పడటంతో ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేసింది కమలదళం. హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకు పొంగులేటి, జూపల్లికి భరోసా ఇవ్వడానికే.. ఈటల ఆ ఇద్దరితో రహస్య చర్చలు జరిపారనే ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

