ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ, జనసేన తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థి..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్డీయే పొత్తు వికటించింది. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు చేత పట్టి భారీ ర్యాలీగా బయలుదేరారు. తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని ఎన్నికల అధికారి చిరంజీవి దగ్గర నామినేషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం అధిష్టానం ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్డీయే పొత్తు వికటించింది. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు చేత పట్టి భారీ ర్యాలీగా బయలుదేరారు. తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని ఎన్నికల అధికారి చిరంజీవి దగ్గర నామినేషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం అధిష్టానం ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మురహరి రెడ్డి మాట్లాడుతూ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిని ప్రకటిస్తే తానను మాత్రం టీడీపీ నేతలు పట్టించుకోలేదన్నారు. అందుకే ఉమ్మడి జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నామినేషన్ వేశానని తెలిపారు. తనకు బీజేపీ అధిష్టానం నుండి బి – ఫారమ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా అసలు ఈ ఎన్డీయే కూటమిలో కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. మరి దీనిపై ఉమ్మడి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకొని ఎవరికి బీ ఫామ్ ఇస్తుందో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..