Kangana Ranaut – Chirag Paswan: ఈ ఎంపీలిద్దరూ.. ఒకప్పుడు ఒకే సినిమాలో హీరో -హీరోయిన్లు.
టి కంగనా రనౌత్ మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోపక్క ఎన్డీయే కూటమికి పూర్తి మద్దతు పలుకుతోన్న లోక్‌జన శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్, బిహార్‌లోని హాజిపుర్ స్థానం నుంచి గెలుపొందారు. వీరిద్దరూ ఒక సినిమాలో కలిసి నటించారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’ చిత్రంలో హీరోహీరోయిన్‌గా చేశారు.
లోక్‌సభ ఫలితాల్లో ఊహించిన ఫలితాలు దక్కపోయినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన సీట్లనైతే ఎన్డీయే సాధించింది. దాంతో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సమయంలో ఇద్దరు ఎంపీలకు సంబంధించి 13 ఏళ్ల నాటి ఓ విషయం ఆసక్తిగా మారింది. అదేంటంటే..? నటి కంగనా రనౌత్ మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోపక్క ఎన్డీయే కూటమికి పూర్తి మద్దతు పలుకుతోన్న లోక్‌జన శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్, బిహార్‌లోని హాజిపుర్ స్థానం నుంచి గెలుపొందారు. వీరిద్దరూ ఒక సినిమాలో కలిసి నటించారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’ చిత్రంలో హీరోహీరోయిన్‌గా చేశారు. అయితే ఆ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
నటనపై ఆసక్తి ఉన్న చిరాగ్.. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి, తండ్రి రామ్‌విలాస్ పాస్వాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐదు చోట్ల తన పార్టీని గెలిపించుకున్నారు. అటు కంగన బాలీవుడ్‌లో అగ్రనాయికగా ఉన్నారు. ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు తొలిసారి ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. ఈ ఎన్నికల తర్వాత వీరికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. చిరాగ్ వీడియోలో మాట్లాడుతూ తామిద్దరం కలిసి నటించడం ప్రేక్షకులకు నచ్చలేదనీ కానీ ఇప్పుడు ఇద్దరం పార్లమెంట్‌కు వెళ్లనున్నాం అనీ అన్నారు. 13 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి పార్లమెంట్‌లో కనిపించబోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.