MLA Attack: టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..! పదవి చూసుకొని రెచ్చిపోతారా..? వీడియో.
అసలే ఎమ్మెల్యే.. ఆపై అధికార పార్టీ.. ఇదే దర్పంతో చెయ్యి చేసుకున్నారు దుర్గం చిన్నయ్య. టోల్ ఫ్లాజా సిబ్బందిపై దాడికి దిగారు. మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై
అసలే ఎమ్మెల్యే.. ఆపై అధికార పార్టీ.. ఇదే దర్పంతో చెయ్యి చేసుకున్నారు దుర్గం చిన్నయ్య. టోల్ ఫ్లాజా సిబ్బందిపై దాడికి దిగారు. మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య దాడికి తెగబడ్డారు. డిసెంబర్ నెలలో ప్రారంభమైన మందమర్రి టోల్‌ప్లాజా వద్ద వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎమ్మెల్యే చిన్నయ్య వాహనం అక్కడకు చేరుకోగానే టోల్‌ప్లాజా సిబ్బంది ప్రోటోకాల్ పాటించకుండా ఆయన పట్ల దురుసుగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కారు దిగి.. రహదారి పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రజల నుంచి టోల్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి. అటు, ఈ దాడి ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదంటున్నారు పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..