Minister Srinivas Goud: ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు..

|

Oct 01, 2023 | 11:50 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఇవాళ పాలమూరులో, మంగళవారం నిజామాబాద్‌లో మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీపై ఫైర్‌ అవుతోంది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రధాని మోదీ పాలమూరుకు ఎలా వస్తున్నారంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఇవాళ పాలమూరులో, మంగళవారం నిజామాబాద్‌లో మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీపై ఫైర్‌ అవుతోంది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రధాని మోదీ పాలమూరుకు ఎలా వస్తున్నారంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అవకాశం ఉన్న ప్రతిసారీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని అవమానిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇచ్చి.. తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం ఇవ్వడం లేదంటూ పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు.

కాగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌జిల్లా పర్యటనకు సర్వం సిద్దమైంది. అభివృద్ధి పనుల శంకుస్థానలు, ప్రారంభోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలమూర్‌-రంగారెడ్డి డిజైన్‌ మార్చి, ఒక్క మోటర్‌ స్టార్ట్‌ చేసి ప్రాజెక్ట్‌ పూర్తయిందని బీఆర్‌ఎస్‌ గొప్పగా చెప్పుకుంటోందంటూ బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు కావాలనే విమర్శలు చేస్తున్నారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..