KTR: మేనిఫెస్టోలో తనకు ఇష్టమైన స్కీమ్ ఏంటో చెప్పిన కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటించిన KCR - ఇప్పుడు పార్టీ మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ యథాతథంగా అమలు చేయడంతో పాటు తిరిగి అధికారంలోకి వస్తే మరిన్ని కొత్త పథకాలు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. మరి మేనిఫెస్టోలో కేటీఆర్‌కు నచ్చిన స్కీమ్ ఏంటి...?
వచ్చే నెల జరగనున్న ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోను తెలంగాణ భవన్‌లో కేసీఆర్ విడుదల చేశారు. 14 పేజీలతో సంక్షిప్తంగా మ్యానిఫెస్టో రూపొందించారు. ప్రస్తుతం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలన్నీ యథాతథంగా కొనసాగిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కొత్త పథకాలను అధికారంలోకి వచ్చినఆరేడు నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారు. కాగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ ఇంటర్వ్యూలో BRS మేనిఫెస్టోలో తనకు బాగా ఇష్టమైన స్కీమ్ ఏదో వెల్లడించారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి ధీమా తనకు ఇష్టమైన పథకమన్నారు. రైతు బీమాను చూసి చాలా వర్గాల నుంచి బీమా కావాలని రిక్వెస్టులు వచ్చాయని.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమగ్రంగా చర్చించి.. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బీమా అందించాలనే నిర్ణయానికి వచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణలోని తెల్ల రేషన్‌కార్డుదారుల కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు కొత్తగా కేసీఆర్ బీమా- ప్రతీ ఇంటికీ ధీమా పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెస్తామని KCR వెల్లడించారు. రైతుబీమా తరహాలో ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా సమకూర్చుతామని వెల్లడించారు. రైతుబీమాకు చెల్లించినట్టే ఈ పథకం ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మాట ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..