AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: మేనిఫెస్టోలో చెప్పని పథకాలను చాలా అమలు చేశాం: కేటీఆర్

Minister KTR: మేనిఫెస్టోలో చెప్పని పథకాలను చాలా అమలు చేశాం: కేటీఆర్

Venkata Chari
|

Updated on: Oct 15, 2023 | 8:00 PM

Share

Minister KTR: వచ్చే నెల జరగనున్న ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోను తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ విడుదల చేశారు. 14 పేజీలతో సంక్షిప్తంగా మ్యానిఫెస్టో రూపొందించారు. ప్రస్తుతం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలన్నీ యథాతథంగా కొనసాగిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కొత్త పథకాలను అధికారంలోకి వచ్చినఆరేడు నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారు.

Minister KTR: తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న ఎలక్షన్స్ కోసం బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ విడుదల చేశారు. 14 పేజీలతో మ్యానిఫెస్టో రూపొందించారు. కాగా, ప్రస్తుతం అమలవుతోన్న పథకాలన్నీ యథాతథంగా కొనసాగుతాయని కేసీఆర్‌ ఈ సదర్భంగా హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన కొత్త పథకాలను అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో అమలు చేస్తామని తెలిపారు. టీవీ9 మేనేజింగ్ డైరెక్టర్ రజినికాంత్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బీమాను చూసి చాలా వర్గాల నుంచి బీమా కావాలని రిక్వెస్టులు వచ్చాయని.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమగ్రంగా చర్చించి.. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బీమా అందించాలనే నిర్ణయానికి వచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు.

మేనిఫెస్టోలో చెప్పని పథకాలను చాలా అమలు చేశాం- కేటీఆర్..

కాగా, గత ఎన్నికల సమయంలో మేం మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో పథకాలను అమలు చేశామని కేటీఆర్ ఈసందర్భంగా గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, దళిత బంధు, రైతుబంధు, మిషన్ భగీరథ ఇలా ఎన్నో పథకాలను తెలంగాణ ప్రజల కోసం అమలు చేశామని తెలిపారు.

మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడమే కాకుండా.. చెప్పని ఎన్నో పథకాలను అందించిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీదేనని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలన సంక్షేమంలో స్వర్ణయుగం.. దేశానికే దిశా నిర్దేశం చేసిందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Oct 15, 2023 07:48 PM