KTR: ప్రజలు చేసిన పని చూసి ఓటేస్తారా ? మేనిఫెస్టో చూసి ఓటేస్తారా ?

KTR: ప్రజలు చేసిన పని చూసి ఓటేస్తారా ? మేనిఫెస్టో చూసి ఓటేస్తారా ?

Ram Naramaneni

|

Updated on: Oct 15, 2023 | 7:51 PM

ప్రజలు ప్రభుత్వం చేసిన పనులు చూస్తారా లేదా మేనిఫెస్టో చూస్తారా..? లేదా ఎన్నికలప్పుడు ఇచ్చే తాయిలాలకు ఓటేస్తారా..? ఈ ప్రశ్నకు కేటీఆర్ తన మార్క్ ఆన్సరిచ్చారు. ప్రజలు అన్ని గమనిస్తారని.. కానీ క్రెడిబులిటీ నిలుపుకున్న వారికే ఓటేస్తారని చెప్పుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో ఈ వీడియోలో తెలుసుకుందాం..

బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను నేడు సీఎం కేసీఆర్ విడుదల చేశారు. కాగా మేనిఫెస్టోకు సంబంధించిన పలు కీలక ప్రశ్నలకు టీవీ9 ఇంటర్వ్యూలో కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. ప్రజలు మేనిఫెస్టోను చూసి ఓటేస్తారా లేదా ప్రభుత్వం చేసిన పనులు చూసి ఓటేస్తారా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్.

“నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొస్తాను. అది తీసుకొస్తే మనిషికి 15 లక్షలు ఇవ్వొచ్చు అన్నారు. ఒక్క రూపాయి ఎవరికైనా వచ్చిందా..? అదే విధంగా కాంగ్రెస్ 2004,2009 ఎన్నికల మేనిఫెస్టోల్లో 9 గంటల ఉచిత విద్యుత్ అని పేర్కొంది.. అదే పార్టీ నేడు 3 గంటల కరెంట్ అంటోంది. వాళ్లు మేనిఫెస్టోల్లో పెట్టి కూడా మాట నిలుపుకోలేదు. మేము మేనిఫెస్టోలో పెట్టనవి కూడా చాలా చేశాం. కాబట్టి క్రెడిబులిటీ ఉన్న పార్టీగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు” అని కేటీఆర్ ఆన్సరిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..  

Published on: Oct 15, 2023 07:50 PM