బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయి..? ఆ పార్టీ గెలుపు మంత్రం ఏంటి..? కేటీఆర్ ఆన్సర్స్

బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయి..? ఆ పార్టీ గెలుపు మంత్రం ఏంటి..? కేటీఆర్ ఆన్సర్స్

Ram Naramaneni

|

Updated on: Oct 15, 2023 | 8:57 PM

బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరిస్తారని కేటీఆర్ అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు..? ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత మేర ఉంటుంది. బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి ఎవరు..? బీఆర్ఎస్‌ గెలిస్తే సీఎం కేసీఆర్‌ అవుతారా? చివరి నిమిషంలో కేటీఆర్‌ అవుతారా? ఏపీలో పరిణామాలు తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయా.. ఇలాంటి అంశాలపై మనతో చర్చించడానికి టీవీ9 స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.

తెలంగాణ దంగల్‌ పీక్‌లోకి చేరింది.. ఇప్పటికే పార్టీలు అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. అగ్రనేతలు ప్రచారక్షేత్రంలోకి దిగారు. 45 రోజుల పాటు హోరాహోరిగా గ్రామాలు, పట్టణాల్లో నినాదాలు మార్మోగనున్నాయి. ఇక అత్యంత కీలకమైన మేనిఫెస్టోలు కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళుతుండగా సీఎం కేసీఆర్‌ కూడా హామీలు ప్రకటించారు. దీంతో ప్రజల్లో వాటి మధ్య పోలికలు, చర్చలు మొదలయ్యాయి. ఇక పరస్పర విమర్శలు, ఆరోపణలు.. సామాజిక సమీకరణాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో..  బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా..? పింక్ ప్రామిస్ గేమ్ ఛేంజర్ కాబోతుందా..? కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న విమర్శలకు కేటీఆర్ కౌంటర్లు ఏంటి..? బీఆర్ఎస్‌‌ను ప్రజలను ఆదరిస్తారని కేటీఆర్ అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలుగుతున్నారు..? ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఈ ప్రశ్నలన్నింటికి కేటీఆర్ సమాధానాలు… ఈ ఇంటర్వ్యూలో చూద్దాం….

Published on: Oct 15, 2023 06:59 PM