Revanth Reddy: కాంగ్రెస్ గ్యారెంటీ స్కీమ్స్‌ను కాపీ కొట్టారు.. BRS Manifestoపై రేవంత్ రెడ్డి కామెంట్స్
కాంగ్రెస్ పథకాలు ప్రకటిస్తే.. వాటిని అమలు చేసేందుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రకటించిన బీఆర్ఎస్... ఇప్పుడు తమ కంటే ఎక్కువ డబ్బులు ప్రకటించారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తద్వారా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు సాధ్యమేనని కేసీఆర్ రాజముద్ర గుద్దారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పైసా ఇవ్వకుండా, మందు పోయకుండా ప్రజల్లోకి వెళ్దామా? అంటూ సవాలు చేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను బీఆర్ఎస్ కాపీకొట్టిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కామ్‌లకే కొంత డబ్బులు పెంచి.. కొత్త హామీలుగా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ పథకాలు ప్రకటిస్తే.. వాటిని అమలు చేసేందుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రకటించిన బీఆర్ఎస్… ఇప్పుడు తమ కంటే ఎక్కువ డబ్బులు ప్రకటించారని విమర్శించారు. తద్వారా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు సాధ్యమేనని కేసీఆర్ రాజముద్ర గుద్దారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పైసా ఇవ్వకుండా, మందు పోయకుండా ప్రజల్లోకి వెళ్దామా? అంటూ సవాలు చేశారు. 17వ తేదీ మధ్యాహ్నం 12 గం.లకు ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేదని అన్నారు. నవంబరు నెల 1 తేదీన పెన్షన్లు, జీతాలు ఇస్తే బీఆర్ఎస్ హామీలను ప్రజలు నమ్ముతారని అన్నారు.
కాగా తమ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని సాధ్యమయ్యే పథకాలే ఉంటారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మానిక్ రావ్ థాక్రే అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆరోపించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మూడు రోజుల పర్యటన ఈ నెల 18,19,20 తేదీల్లో ఉంటుందన్నారు.