KCR vs CM Revanth Reddy: నన్ను, నాపార్టీని టచ్‌ చేయలేరు.. నీకంటే హేమాహేమీలను చూసినం: కేసీఆర్.

|

Feb 07, 2024 | 7:02 PM

భారత రాష్ట్ర సమితికి పోరాటం కొత్త కాదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు తెలంగాణ భవన్‌లో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల అంశంపై పోరాటంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులన్నీ కేఆర్‌ఎంబీకి అప్పగించే యోచనలో ఉందని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు.

భారత రాష్ట్ర సమితికి పోరాటం కొత్త కాదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు తెలంగాణ భవన్‌లో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల అంశంపై పోరాటంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులన్నీ కేఆర్‌ఎంబీకి అప్పగించే యోచనలో ఉందని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కృష్ణా నదీజలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూన్నామన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు.

సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్ హాట్ కామెంట్స్‌ చేశారు. తనను, తన పార్టీ బీఆర్‌ఎస్‌ను టచ్ చేయడం రేవంత్‌ వల్ల కాదన్నారు కేసీఆర్‌ రేవంత్‌ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది. తెలంగాణను పదేళ్లు పదిలంగా కాపాడుకున్నాం. తెలంగాణ కోసం కేసీఆర్‌ ఏనాడూ వెనక్కి పోడని చెప్పారు. ఉడుత బెదిరింపులకి భయపడనని చెప్పారు కేసీఆర్‌. తాము అధికారంలో ఉండగా ప్రాజెక్ట్‌లు అప్పగించాలని కేంద్రం ఒత్తిడి తెచ్చింది. ప్రాజెక్ట్‌లు అప్పగించకుంటే నోటిఫై చేస్తామని బెదిరించారు. ప్రాజెక్ట్‌లు అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశానని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో తెలుసు. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దామన్నారు కేసీఆర్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..