మెదక్ జిల్లాలో భారీగా నగదు సీజ్ చేశారు పోలీసులు. రూ.88లక్షల 43వేలు స్వాధీనం చేసుకున్నారు. లోక్ సభ ఎన్నికల పోలింగ్‌కు కేవలం గంటల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అణువణువునా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రబలగాలను మొహరింపజేసి నిఘా పెంచారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని గ్రామాల్లో పంపిణీకి తీసుకెళ్తున్న డబ్బును పట్టుకున్నారు తనిఖీ అధికారులు. పోతిన్‌పల్లి చెక్‌పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీల్లో బయటపడ నగదును పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అర్థరాత్రి వేళ డబ్బులు తీసుకెళ్తున్న వారిని విచారించగా పెద్దశివనూరు గ్రామ శివారులోని గెస్ట్‌హౌస్ నుంచి నగదు తీసుకొస్తున్నట్లు చెప్పారు. నిందితులను ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి 2 కార్లు సీజ్ చేశామన్నారు రామాయంపేట సీఐ. ఏ పార్టీకి సంబంధించిన నగదు అన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…