Pawan Kalyan: పవన్‌ను చుట్టుముట్టిన వైసీపీ సైన్యం.. పిఠాపురంలో హీటెక్కిన రాజకీయం..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడును పెంచాయి. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అందరిచూపు పవన్ కల్యాణ్ పోటీచేసే పిఠాపురం నియోజకవర్గం వైపు పడింది.

Updated on: Mar 22, 2024 | 9:48 AM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడును పెంచాయి. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అందరిచూపు పవన్ కల్యాణ్ పోటీచేసే పిఠాపురం నియోజకవర్గం వైపు పడింది. పిఠాపురంలో పవన్‌ని ఓటించేందుకు వైసీపీ వ్యూహం రచిస్తోంది. దీనిలో భాగంగా పెండెం దొరబాబును క్యాంప్‌ కార్యాలయానికి పిలిచి మాట్లాడిన సీఎం జగన్‌ పలు కీలక సూచనలు చేశారు. పిఠాపురం అభ్యర్ధి వంగా గీత వర్గంతో సమన్వయంతో ఉండి వైసీపీ జెండా ఎగరవేయాలన్నారు.

అంతేకాకుండా, కాపునేత ముద్రగడ పద్మనాభం, వైసీపీ నేతలు మిధున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలను కూడా రంగంలోకి దింపారు. దీంతో పిఠాపురం కేంద్రంగా రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us