Watch Video: ‘నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం’.. జేసీ కీలక వ్యాఖ్యలు..

తాడిపత్రి అల్లర్ల తర్వాత తొలిసారి జెసి ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పాత్రికేయులతో మాట్లాడుతూ జెసి ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జెసి ట్రావెల్స్‎పై తప్పుడు కేసులు బనాయించి తనను జైలుకు పంపించారని జెసి ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే తనపై తప్పుడు కేసులు బనాయించారో.. ఆ అధికారులే స్వయంగా తన బస్సులను రిపేర్ చేయించాలని తెలిపారు.

Watch Video: 'నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం'.. జేసీ కీలక వ్యాఖ్యలు..

| Edited By: Srikar T

Updated on: Jun 19, 2024 | 6:03 PM

తాడిపత్రి అల్లర్ల తర్వాత తొలిసారి జెసి ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పాత్రికేయులతో మాట్లాడుతూ జెసి ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జెసి ట్రావెల్స్‎పై తప్పుడు కేసులు బనాయించి తనను జైలుకు పంపించారని జెసి ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే తనపై తప్పుడు కేసులు బనాయించారో.. ఆ అధికారులే స్వయంగా తన బస్సులను రిపేర్ చేయించాలని తెలిపారు. లేదంటే ట్రాన్స్ పోర్ట్ అధికారుల ఇళ్ళ ముందు ధర్నా చేస్తారని జెసి ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. అదేవిధంగా తప్పుడు కేసులు బనాయించిన వారిపై విచారణ జరపాలని కూడా జెసి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పార్టీకి తన వల్ల చెడ్డ పేరు వస్తుందంటే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడానికైనా సిద్ధమంటున్నారు. తనపై.. తన కుటుంబ సభ్యులపై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలని జిల్లా ఎస్పీకి పది రోజుల గడువు ఇచ్చారు. 10 రోజుల్లో విచారణ చేపట్టకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షకు కూర్చుంటానని జెసి ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us