Watch Video: కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. మాజీ మంత్రి కేటీఆర్
కేసీఆర్ ప్రచారంపై నిషేధం అప్రజాస్వామికం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మోదీ, అమిత్ షా వ్యాఖ్యలపై ఈసీ స్పందించడం లేదన్నారు. రేవంత్ వ్యాఖ్యలు ప్రవచనాల్లా అనిపిస్తున్నాయా అంటూ ఈసీని ప్రశ్నించారాయన. రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈసీకి కనపడవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌పై ఈసీకి 8 ఫిర్యాదులు చేశామన్నారు కేటీఆర్. వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ యాత్రతో బీజేపీ, కాంగ్రెస్‌కు వణుకుపుట్టిందన్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 8 నుంచి12 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రచారంపై నిషేధం అప్రజాస్వామికం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మోదీ, అమిత్ షా వ్యాఖ్యలపై ఈసీ స్పందించడం లేదన్నారు. రేవంత్ వ్యాఖ్యలు ప్రవచనాల్లా అనిపిస్తున్నాయా అంటూ ఈసీని ప్రశ్నించారాయన. రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈసీకి కనపడవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌పై ఈసీకి 8 ఫిర్యాదులు చేశామన్నారు కేటీఆర్. వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ యాత్రతో బీజేపీ, కాంగ్రెస్‌కు వణుకుపుట్టిందన్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 8 నుంచి12 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు 48 గంట పాటు ప్రచారాన్ని నిషేధించింది. దీంతో మే 1 రాత్రి 8 గంటల నుంచి మే 3 రాత్రి 8 గంటల వరకు ప్రచారాన్ని చేసేందుకు కేసీఆర్కు అనుమతి నిరాకరించింది. దీంతో గతంలో నిర్ణయించిన పర్యటనల షెడ్యూల్లో కొంత మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ త్వరలో కొత్త షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..