Watch Video: 'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స నారాయణ..

Watch Video: ‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం’.. మాజీ మంత్రి బొత్స నారాయణ..

Srikar T

|

Updated on: Jun 30, 2024 | 6:25 PM

అధికారంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత 20 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు ఉండకూడదని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై స్పందించారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి సంఘటనలు ఒకట్రెండు జరిగాయన్నారు. అప్పుడు అలాంటివి జరిగాయి కాబట్టే ప్రజలు అధికారం టీడీపీకి ఇచ్చారని గుర్తు చేశారు.

అధికారంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత 20 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు ఉండకూడదని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై స్పందించారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి సంఘటనలు ఒకట్రెండు జరిగాయన్నారు. అప్పుడు అలాంటివి జరిగాయి కాబట్టే ప్రజలు అధికారం టీడీపీకి ఇచ్చారని గుర్తు చేశారు. తాను తమ పార్టీ చేసిన తప్పులను సమర్థించడం లేదని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మొదట్లోనే కార్యకర్తలకు సర్ధిచెప్పుకుని సరిచేసుకున్నామని వివరించారు. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తమ పార్టీ ఆఫీసులన్నీ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలంలో కడుతున్నవే అని గుర్తు చేశారు. అప్పుడు ఇచ్చిన జీవోల ప్రకారం కాకుండా వేరేవిధంగా నిర్మించలేదని చెప్పారు. ఒకవేళ తమ ప్రభుత్వ హయాంలో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని తాము ధీటుగా ఎదుర్కొంటామని.. అంతేకానీ ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడకూడదని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..