Elections 2024: లక్ష 20 వేల కోట్లు.. ఈ సారి ఎన్నికలకు అయ్యే ఖర్చు..?

|

Mar 15, 2024 | 8:46 PM

2012లో పూరీ జగన్నాథ్ డైరక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా మీలో ఎంత మంది చూశారు..? చూడకపోతే... ఇది ఎలక్షన్ టైం కనుక.. వీలైతే ఓ సారి ఎలక్షన్ కోసం.. ఎన్నికల్లో అయ్యే ఖర్చుల కోసం మహేశ్ బాబు చెప్పే డైలాగ్స్ ఓ సారి యూట్యూబ్‌లో చూడండి. ఇదేం సినిమా ప్రమోషన్ కాదు... నిజానికి నేనే మీకు చూపించే వాడిని కానీ... మనది టీవీ కాదు.. సోషల్ మీడియా సవాలక్ష కాపీ రైట్స్ ఇష్యూస్ వస్తాయని.. మిమ్మల్నే చూడమంటున్నా.

సాధారణంగా ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ ఎక్కువ నిధుల్ని సేకరించే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రత్యర్థులతో పోల్చితే వాళ్లు మరింత ఎక్కువే ఖర్చు పెడతారన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఆ పార్టీ – ఈ పార్టీ అని తేడా ఉండదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు. ప్రతి ఎన్నికల్లో తాము నిబంధనల్లో పేర్కొన్నట్టే అభ్యర్థులు ఖర్చు పెట్టి తీరాలన్న ఉద్ధేశంతో ఎన్నికల కమిషన్ పగడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ, నియోజకవర్గాల సరిహద్దుల్లోనూ గట్టి నిఘా పెడుతుంది. అలా పెట్టడం వల్లే లెక్కలకు దొరకని వేల కోట్ల రూపాయుల ప్రతి ఎన్నికల్లో పట్టుబడుతున్నాయి. అయితే ఈసీ ఎంత మొత్తాన్ని పట్టుకుంటోందో.. దాదాపు అంతకు 3-4 రెట్ల మొత్తాన్ని పార్టీలు లెక్కలు చూపించకుండానే ఖర్చు పెడుతుంటాయి. ఎప్పటి లాగే ఈ సారి కూడా ఎన్నికల్లో డబ్బు పంపకాలు జరగకుండా చూసేందుకు ఈసీ ఈ సారి కూడా గట్టి ఏర్పాట్లే చేస్తోంది. సుమారు ఈడీ, ఐటీ, రెవెన్యూ ఇంటిలిజెన్స్, సహా 20 సెంట్రల్ ఏజెన్సీలను రంగంలోకి దింపుతోంది. ఈ సారి దాని ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో మున్ముందు చూడాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..