YSRCP: వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్

YSRCP: వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్

Ram Naramaneni

|

Updated on: Mar 15, 2024 | 1:11 PM

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో జగన్‌ గెలుపు కోసం కృషి చేస్తానని ముద్రగడ తెలిపారు. వివరాలు తెలుసుకుందాం పదండి....

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన. ముద్రగడతోపాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. సీఎం జగన్‌ పాలనతో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని భావించి చివరకు వైసీపీ వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

1978లో జనతా పార్టీతో ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎన్టీయార్‌ టీడీపీ స్థాపించిన తర్వాత ముద్రగడ చేరారు. ఉమ్మడి ఏపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా , ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలిచారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ లోక్‌సభ స్థానంలో గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు ముద్రగడ పద్మనాభం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published on: Mar 15, 2024 01:10 PM