Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diesel Gang Video: హైవేపై వింత గ్యాంగ్.. లారీ కనిపిస్తే చాలు అదే పని.. వైరల్ అవుతున్న వీడియో..

Diesel Gang Video: హైవేపై వింత గ్యాంగ్.. లారీ కనిపిస్తే చాలు అదే పని.. వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Oct 03, 2021 | 9:19 PM

బంగారం చోరీ కోసం కన్నాలు వేయడం చూశాం. ట్యాక్సులు తప్పించుకొనేందుకు బంగారం అక్రమ రవాణా గురించి విన్నాం. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలతో డీజిల్‌ బంగారంలా మారింది. ఈ ఇంధనం ధర వంద దాటడంతో...

బంగారం చోరీ కోసం కన్నాలు వేయడం చూశాం. ట్యాక్సులు తప్పించుకొనేందుకు బంగారం అక్రమ రవాణా గురించి విన్నాం. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలతో డీజిల్‌ బంగారంలా మారింది. ఈ ఇంధనం ధర వంద దాటడంతో అంతర్రాష్ట్ర దొంగలు మహారాష్ట్ర నుంచి వచ్చి హైవేలపై చోరీలకు తెగబడుతున్నారు. హైవేపై రాత్రి వేళ ఆగి ఉన్న లారీల నుంచి డీజిల్‌ చోరిచేసి తక్కువకు స్థానికులకే విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో హైవేలపై చోరీలు చేస్తున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇటీవల కాలంలో హైవేలపై డీజిల్‌ చోరీలు పెరిగాయి. రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీల్లో డీజిల్ దొంగతనం చేస్తున్నారు. దాబా హోటళ్లు టోల్‌గేట్‌ దగ్గర ఆగి ఉన్న లారీలను టార్గెట్ చేసుకుని డీజిల్‌ దొంగతనానికి పాల్పడుతున్నారు.. ఇటీవల కాలంలో జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో డీజిల్‌ చోరీలపై ఫిర్యాదులు అందాయి. ఈ కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలింది.తిరుపతి- బెంగళూరు రహదారిలోని సీతమ్స్ కాలేజీ దగ్గర లారీలను ఛేదించి ఆరుగురిని అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో చెర్లోపల్లిలో మరో రెండు లారీలను స్వాధీనం చేసుకుని ఐదుగురుని, మరో ప్రాంతంలో దాబా యజమానిని అరెస్టు చేశారు. మొత్తం 12 మందిని అరెస్ట చేశారు. 4 లారీలు, 2,100 లీటర్ల డీజిల్‌ రూ.1.24 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ప్రకాశం జిల్లాలో హైవేలపై చోరీలు చేస్తున్న గ్యాంగ్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. హైవేపై రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీల్లో డీజిల్ దొంగతనం చేస్తున్నారు. గుడ్లూరు మండలం తెట్టుకు చెందిన ఇద్దరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.. టీమ్‌ను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. హైవేపే అనుమానంగా తిరుగుతున్న కొందర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రాత్రిపూట మినీ ఐషర్‌ వాహనంలో తిరుగుతూ హైవే వెంట ఆగి ఉన్న వాహనాల నుంచి డీజిల్‌ను చోరీ చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. 
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: హన్మకొండ జిల్లాలో అరుదైన సంఘటన.. అభివృద్ధి కోసం..గ్రామ పంచాయతీకి తాళం..(వీడియో)

 Pakistani Terrorist: పట్టుబడిన పాక్‌ ఉగ్రవాది.. టెర్రరిస్ట్‌ల ట్రైనింగ్‌ ఆసక్తి విషయాలు వెల్లడి..!(వీడియో)

 Crow Attack on Drone Viral Video: డ్రోన్‌ పై దాడిచేసిన కాకి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..

 CM Charanjit Singh Video: పిలవని పెళ్ళికి వెళ్లిన సీఎం…షాక్‌ అయిన వధూవరులు..! వైరల్ అవుతున్న వీడియో..