Revanth Reddy: ఒక్క సీటైనా గెలవండి.. చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్

|

Feb 27, 2024 | 10:09 PM

తెలంగాణ ప్రభుత్వం మరో రెండు పథకాలను ఇవాళ ప్రారంభించనుంది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మరో రెండు పథకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీకారం చుట్టనున్నారు. మంగళవారం చేవెళ్ల లోని ఫరా కాలేజ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఈ రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.

తెలంగాణ ప్రభుత్వం మరో రెండు పథకాలను ఇవాళ ప్రారంభించనుంది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మరో రెండు పథకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీకారం చుట్టనున్నారు. మంగళవారం చేవెళ్ల లోని ఫరా కాలేజ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఈ రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తున్న మరో రెండు పథకాల్లో ఒకటి గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కాగా.. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తుండగా.. విశిష్ట అతిథిగా మల్లు భట్టి విక్రమార్క.. సభాధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. లక్షమందితో కాంగ్రెస్‌ ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సభలో 2 గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..