అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్.. కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్..
అనకాపల్లి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో వెళ్లి నామినేషన్ వేశారు. అనకాపల్లిలో సాయంత్రం జరిగే బహిరంగసభకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వస్తారని సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లిలో కొందరు తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని.. ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ల సంగతి ఏంటో చూస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రమేష్.
అనకాపల్లి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో వెళ్లి నామినేషన్ వేశారు. అనకాపల్లిలో సాయంత్రం జరిగే బహిరంగసభకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వస్తారని సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లిలో కొందరు తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని.. ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ల సంగతి ఏంటో చూస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రమేష్. ఇదిలా ఉంటే పంచకర్ల రమేష్, సీఎం రమేష్ లకు మెగాస్టార్ చిరంజీవి మద్దతుగా నిలిచారు. వారికి ఓటు వేయమని చెప్పిన వీడియో వైరల్ గా మారింది. అయితే చిరంజీవి తనపై అభిమానంతో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారని.. ఆ మాటలను వక్రీకరించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. సినిమా రంగాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఏపీలో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో చాలా మంది కీలక నేతలు నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. ఇన్నాళ్లు ప్రచారంలో బిజీగా గడిపిన నేతలు ప్రస్తుతం నామినేషన్ అఫిడవిట్లను రిటర్నింగ్ అధికారులకు సమర్పించేపనిలో పడ్డారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..