అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కరీంనగర్‌లోని ప్రజా ఆశీర్వాద సభలో.. అనంతరం చొప్పదండిలో మధ్యాహ్నం 2.35 గంటలకు.. ఆ తర్వాత మధ్యాహ్నం 3.45 గంటలకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట డిగ్రీ కళాశాలలో నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారు.