Big News Big Debate: ఏపీలో మెగా ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్‌.. తరచుగా బీజేపీ నేతలతో టచ్‌లో పవన్‌, చిరు

Big News Big Debate: ఏపీలో మెగా ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్‌.. తరచుగా బీజేపీ నేతలతో టచ్‌లో పవన్‌, చిరు

Phani CH

|

Updated on: Nov 21, 2022 | 7:06 PM

మళ్లీ రాజకీయాల జోలికి రానుంటూనే ఏదో రూపంలో మెగా హీరో చిరంజీవి ఏపీ పొలిటికల్‌ పిక్చర్‌లో తరచుగా కనిపిస్తున్నారు. గతంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారారు చిరంజీవి.

మళ్లీ రాజకీయాల జోలికి రానుంటూనే ఏదో రూపంలో మెగా హీరో చిరంజీవి ఏపీ పొలిటికల్‌ పిక్చర్‌లో తరచుగా కనిపిస్తున్నారు. గతంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారారు చిరంజీవి. ప్రధానితో పర్సనల్‌ ముచ్చట్లతో టాక్‌ ఆఫ్‌ ది ఏపీ అయ్యారు. తర్వాత సినిమా ప్రమోషన్‌లో భాగంగా డైలాగులు లీక్‌ చేసి మరీ చర్చకు తావిచ్చారు. తాజాగా తన తమ్ముడిని ఏదోరోజు అత్యున్నత స్థానంలో చూస్తామంటూ ప్రకటించి సంచలనంగా మారారు. అన్నా తమ్ముళ్లు ప్రధానిని కలిసిన తర్వాత మెగా ఫ్యామిలీ విషయంలో బీజేపీ ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తుందన్న ప్రచారం నడుస్తోంది. తాజాగా ఆయనకు ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రావడం దీనికి ప్రధాని నుంచి కిందిస్థాయి నేతల వరకూ బీజేపీ నుంచి అభినందనలు రావడం ఆసక్తి రేపుతోంది. ఏపీలో అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి చిరు సాయం తీసుకుంటున్నారా?

Published on: Nov 21, 2022 07:06 PM