Big News Big Debate: కాపు కథాచిత్రమ్‌.. ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న కాపు ఓట్లు.. (లైవ్ వీడియో)

Big News Big Debate: కాపు కథాచిత్రమ్‌.. ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న కాపు ఓట్లు.. (లైవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 27, 2022 | 7:09 PM

రంగా లెగసీ కోసం పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.. కాపుల మెప్పు కోసం వారు చేయని ప్రయత్నం లేదు. ఈ సందర్భంగా పలు చోట్ల పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి.


రంగా లెగసీ కోసం పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.. కాపుల మెప్పు కోసం వారు చేయని ప్రయత్నం లేదు. ఈ సందర్భంగా పలు చోట్ల పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి. అయితే ఇదంతా అయన మీద ఉన్న ప్రేమ కంటే కూడా ఆ సామాజిక వర్గం ఓట్ల కోసం చేస్తున్న రచ్చగానే ఉంది. గుడివాడలో రంగా వర్ధంతి వేడుకలు వాటి నిర్వహణ విషయంలో రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అటు వైసీపీ కార్యక్రమానికి వంగవీటి రాధా వెళ్లడంతో.. తర్వాత రోజు టీడీపీ ఆయన్ను తమ కార్యక్రమానికి రప్పించింది.రంగా చనిపోయి 34 ఏళ్లు అవుతోంది. అయినా ఆయనకున్న క్రేజ్‌ తగ్గలేదు. కాపు సామాజికవర్గం ఆరాధ్యదైవంగా భావిస్తోంది. రంగాను తమవాడు అనిపించుకుంటే చాలు మెజార్టీ సామాజిక వర్గం ఓట్లు తమకే దక్కుతాయని పార్టీలు భావిస్తున్నాయి. రంగాని హత్య చేసింది టీడీపీయేనని వైసీపీ అంటుంటే.. హత్య చేసేనోళ్లు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారని తెలుగుదేశం విమర్శిస్తోంది. ఇక కాపులకు ఉత్తిత్తి పదవులతో ప్రధానపార్టీలు ఇంతకాలం మోసం చేశాయన్నారు బీజేపీ నేతలు. విశాఖలో జరిగిన రంగా వర్దంతిని వైసీపీ, టీడీపీ బాయ్‌కాట్‌ చేసినా.. బీజేపీ, జనసేన మాత్రం వెళ్లి మద్దతు పలికాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 27, 2022 07:08 PM