Bandi Sanjay: రేపు కరీంనగర్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నా..

Bandi Sanjay: రేపు కరీంనగర్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నా..

Srikar T

|

Updated on: Nov 05, 2023 | 3:54 PM

తెలంగాణలో ఎన్నికల వేళ అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రజలను ఆకర్షించే పథకాలతో దూసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎల్లుండి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నట్లు తెలిపారు. మోదీ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలకు దిశా నిర్థేశం చేశారు.

తెలంగాణలో ఎన్నికల వేళ అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రజలను ఆకర్షించే పథకాలతో దూసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎల్లుండి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నట్లు తెలిపారు. మోదీ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలకు దిశా నిర్థేశం చేశారు. బీసీ కమిషన్‌ను నియమించిన ఘనత బీజేపీదే అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని తెలంగాణ సీఎం చేస్తామన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 50శాతం సీట్లు బీసీలకు ఇవ్వబోతున్నామన్నారు. ఇప్పటి వరకూ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్న బండి సంజయ్ రేపు కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తానన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ తరుణంలో కరీంనగర్ ప్రజలు ఎవరికి పట్టం గడతారో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వేచిచూడాలి.