Kishan Reddy: కేసీఆర్‌పై కిషన్ రెడ్డి కామెంట్స్
తెలంగాణలో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి. గెలుపు కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి ప్రచార కార్యక్రమాల్లో జోష్ పెంచారు. స్వయంగా కేసీఆర్ ప్రతి రోజూ ఏదో ఒక నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా విమర్శిస్తుంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి. గెలుపు కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి ప్రచార కార్యక్రమాల్లో జోష్ పెంచారు. స్వయంగా కేసీఆర్ ప్రతి రోజూ ఏదో ఒక నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా విమర్శిస్తుంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దళితున్ని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఉద్యమాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజా ఆందోళనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన 1200 మంది బలిదానాలకు బాధ్యులెవరు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులను కలిసే పరిస్థితే లేదని ఎద్దేవా చేశారు. సీఎం నూతనంగా నిర్మించిన సచివాలయానికి ఎందుకు రావడంలేదని నిలదీశారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..