Amith Shah: విశాఖకు రానున్న అమిత్ షా..! ఎప్పుడు..? ఏపీపై బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్‌..!

Amith Shah: విశాఖకు రానున్న అమిత్ షా..! ఎప్పుడు..? ఏపీపై బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్‌..!

Anil kumar poka

|

Updated on: Jun 02, 2023 | 9:17 PM

ఏపీలో షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే వైసీపీ, టీడీపీ వేడి రగిలిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు.

ఏపీలో షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే వైసీపీ, టీడీపీ వేడి రగిలిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు. ఈనెల 8న విశాఖలో అమిత్ షా భారీ బహిరంగ సభ.. 10న వచ్చే జేపీ నడ్డాతో తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతల పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందా.. లేదా అనే చర్చ నడుస్తోంది. ఏపీ బీజేపీ నేతలు పదే పదే ఈ అంశానికి సమాధానం ఇవ్వక తప్పడం లేదు. పవన్‌ కల్యాణ్‌ తమతోనే ఉన్నారని.. జనసేనతోనే ఎన్నికలకు వెళ్తామని బీజేపీ నేతలు చెబుతున్నా.. పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలు మరోలా ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.