White House: వైట్‌హౌస్‌లో విందు.. స్పెషల్ అట్రాక్షన్‌గా అంబానీ కపుల్స్.. వీడియో.
రత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ గౌరవార్థం వైట్ హౌస్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ విందులో భారతదేశానికి చెందిన కొందరు ప్రముఖులతో పాటు అమెరికాకు చెందిన వారు పాల్గొన్నారు.
రత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ గౌరవార్థం వైట్ హౌస్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ విందులో భారతదేశానికి చెందిన కొందరు ప్రముఖులతో పాటు అమెరికాకు చెందిన వారు పాల్గొన్నారు. బడా వ్యపారవేత్తలు, టెక్ దిగ్గజాలు, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో కలిసి మోదీ విందును ఆశ్వాదించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ విందుకు దాదాపు 400 మంది గెస్టులను బైడెన్ ఆహ్వానించారు. విందులో అంబానీ దంపతులు, ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కపుల్స్‌తో పాటు,ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇంద్ర నూయి, ఆనంద్ మహీంద్రా, నిఖిల్ కామత్, ఆంటోనీ బ్లింకెన్, శాంతను నారాయణ్, ఎరిక్ గార్సెట్టి, కెవిన్ మెక్‌కార్తీ, సత్య నాదెళ్ల, గినా రైమోండో తదితరులు ఉన్నారు. అమెరికాను సందర్శించే ఆయా దేశాల అధినేతలను గౌరవించే పద్ధతిలో భాగంగా ఎన్నో ఏళ్లుగా అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్‌లో ఆనవాయితీగా స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేస్తారు. బైడెన్ అధ్యక్షుడు అయ్యాక దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్‌కు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లకు మాత్రమే ఇలాంటి విందు ఏర్పాటు చేశారు. తాజాగా ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విందు ఇవ్వడం ద్వారా భారత్‌కు బైడెన్ ఇస్తున్న ప్రాముఖ్యత తెలుస్తోంది. ఇలాంటి లగ్జరీ విందుకు హాజరై అంబానీ దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి వీరు విందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో వీరి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

