ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి చేశారు. ఆయనో ఆరెస్సెస్ మనిషి అన్నారు. రాహుల్‌కు పక్కనే ఖాకీ నిక్కర్ వేసుకుని ఉన్న వ్యక్తి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పాతబస్తీ బండ్లగూడలో.. ఫాతిమా ఒవైసీ పీజీ కాలేజీ క్యాంపస్‌లో ప్రసంగించారు అక్బరుద్దీన్ ఒవైసీ. బీజేపీకి తెలంగాణలో సీన్ లేదని తెలిసిపోవడం వల్ల కాంగ్రెస్‌తో ఆర్ధిక ఒప్పందం కుదుర్చుకున్నారని.. అందులో భాగంగానే ఆరెస్సెస్ వ్యక్తిని తీసుకొచ్చి పీసీసీ చీఫ్‌ని చేశారన్నారు అక్బరుద్దీన్. ఇప్పుడు ఆరెస్సెస్‌తోపాటు.. వీహెచ్‌పీ కూడా రేవంత్ సీఎం కావడం కోసం పనిచేస్తున్నాయన్నారు. తన మాటలు తప్పైతే రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు.
అటు రాహుల్, సోనియాలపై కూడా విమర్శలు గుప్పించారు అసద్. సోనియా గాంధీ ఎక్కడ జన్మించారని ప్రశ్నించారు. “నేను మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చానని చెప్పారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రాహుల్ గాంధీ… మీ అమ్మ భారత్‌కు ఎక్కడి నుండి వచ్చారు” అని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..